ఈ పాలకులపై ముస్లింలలో తీవ్ర వ్యతిరేకత: టీడీపీ అభ్యర్థి టీజీ భరత్
1 min readడాక్టర్ గఫార్ వీధి, చిన్న రంగరాజు వీధిలో టీజీ భరత్ భరోసా యాత్ర
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తమ వాడని ఎమ్మెల్యేగా ఓట్లు వేసి గెలిపించుకుంటే చివరికి తమ సమస్యలు సైతం కూడా తీర్చలేదని స్వయంగా ముస్లింలే చెబుతున్నారని కర్నూల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. డాక్టర్ గఫార్ వీధి, చిన్న రంగరాజు వీధిలో శుక్రవారం ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాలు, ఆరు గ్యారంటీల మేనిఫెస్టోను ప్రజలకు అందించి టీజీ భరత్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా టీజీ భరత్‌కు ముస్లిం మహిళలు, పెద్దలు.. అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వైర్ల సమస్యలను మొరపెట్టుకున్నారు. డ్రైనేజీలు కంపు కొడుతున్నా పట్టించుకోవడం లేదని బాధను చెప్పుకున్నారు. కులం చూసి ఓటు వేస్తే తమకు నష్టమే జరిగిందని అన్నారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. తాను రూపొందించిన ఆరు గ్యారంటీల మేనిఫెస్టో అమలు అయితే ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు తీరిపోతాయన్నారు. కులం, మతం పక్కనపెట్టి ఒక్కసారి తన పాలన చూడాలని అన్నారు. తాను గెలిస్తే కర్నూలు నగరంతోపాటు జిల్లా మొత్తం అభివృద్ధి చెందుతున్నారు. కర్నూల్ నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తానన్నారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి.. టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు శేషగిరి శెట్టి, జియా, కార్పొరేటర్ పరమేష్, మన్సూర్ అలీఖాన్, టీజీ శ్రీనివాసులు, సల్మాన్, విఠల్ శెట్టి, శ్రీధర్, మంజూ, భాగ్యలక్ష్మీ, సుకూర్, ఇంజార్, ఇమ్రాన్, ఫర్తుల్లా, షమీర్, ఖలీల్, రహ్మతుల్లా, యూసుఫ్, మూనీర్, రాజేశ్వరి, రేణుక, సతీష్, మురళి, నారాయణ, కిరణ్, బూత్ ఇంఛార్జ్‌లు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.