NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

40 ఏళ్లు జ‌గ‌న్ సీఎంగా ఉండాలి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సీఎం జ‌గ‌న్ పై సెటైర్లు వేయ‌డంలో న‌ర్సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ స్టైలే వేరు. ఒక‌సారి తిట్టిన‌ట్టు ఉంటుంది. మ‌రోసారి పొగిడిన‌ట్ట ఉంటుంది. ఆయ‌న తిడుతున్నారో.. పొగుడుతున్నారో అర్థం కాక‌.. జ‌నం క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నారు. తాజాగా త‌నదైన శైలిలో విమ‌ర్శల బాణాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 40 ఏళ్లు పాలించాల‌ని కోరుకున్నారు. భార‌తంలో దుర్యోధ‌నుడిలా సీఎం జ‌గ‌న్ అవ్వడం త‌న‌కు ఇష్టం లేద‌న్నారు. ప్రభుత్వ నిర‌కుంశ వైఖ‌రి వ‌ల్ల బ్యూరో క్రాట్స్ కోర్టుల చేత మొట్టికాయ‌లు తింటున్నార‌ని, ఇంతాల కోర్టుల చేత మొట్టికాయ‌లు తింటున్న బ్యూరో క్రాట్స్ ఎవ‌రూ లేరంటూ విమ‌ర్శించారు. విద్యార్థుల విష‌యంలో అంద‌రిదీ ఒక తీరు అయితే.. ఏపీ సీఎంది ఇంకో తీరు అని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో విద్యార్థుల‌కు పెద్ద గండం త‌ప్పింద‌న్నారు.

About Author