NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సీనియర్ సివిల్ జడ్జి శైలిజ

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: చట్టాల పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నార సీనియర్​ సివిల్ జడ్జి శైలాజ. రాయచోటీ మండలం దూళ్ళవారి పల్లే గ్రామంలో మంగళవారం మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో లోక్​ అదాలత్ , లీగల్ సర్వీసెస్ అథారిటీ పై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ సివిల్ జడ్జి శైలజా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు.

తద్వారా సమస్యలు పరిష్కరించుకోడానికి వీలుంటుందన్నారు. అదేవిధంగా లోక్ అదాలత్ ద్వారా సమస్యలు పై కౌన్సిలింగ్ ఎలా ఇస్తారు, న్యాయం ప్రతి ఒక్కరికీ సమానం అనే విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమము లో తహసీల్దార్ శ్రీ సుబ్రమణ్యం రెడ్డి, చెన్నముక్కపల్లి సర్పంచ్ శ్రీ.శ్రీనివాసరెడ్డి గారు , అద్వకేట్ శ్రీ నాగేశ్వరావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author