కరోనతో కలిసి జీవించాలి !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన వైరస్ కొత్త వేరియంట్లు, వేవ్ లు పుట్టుకు వస్తుంటాయని ప్రముఖ వైరాలజిస్ట్ గగన్ దీప్ కాంగ్ అన్నారు. కోవిడ్ లు మళ్లీ మళ్లీ వస్తాయని, వాటితో కలిసి జీవించడం నేర్చుకోవాలని తెలిపారు. డెల్టా కంటే తాజా ఒమిక్రాన్ ప్రభావం తక్కువేనని తెలిపారు. పిల్లలపై కోవిడ్ ప్రభావం తక్కువేనని తెలిపారు. వారిని పాఠశాలలకు పంపడమే ఉత్తమమని చెప్పారు. గత కొన్ని రోజులుగా 10 వేలకు దిగువనే కేసులు నమోదవుతున్నా.. తాజాగా 16 కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.