గుంపులుగా పందుల తరహాలో పంచుకోవాలి !
1 min read
పల్లెవెలుగువెబ్ : రాష్ట్రంలోని 175 సీట్లలో ఒకేసారి పోటీ చేయగల సత్తా వైసీపీకి మాత్రమే ఉందని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో ఒకేసారి 160 సీట్లు పోటీ చేసే సత్తా ఏ ప్రతిపక్ష పార్టీకి లేదని ఆయన ఎద్దేవా చేశారు. గుంపులుగా పందుల తరహాలో ప్రతిపక్షాలన్నీ కలిసి 175 సీట్లు పంచుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. జగన్ అనే సింహం సింగిల్‌గానే పోటీ చేస్తుందని ఆయన అన్నారు. చావులను రాజకీయాలకు వాడుకుని రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. 60 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీలో సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు.