ముత్తుకూరు గౌడప్ప,గులాం రసూల్ ఖాన్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని వినతి
1 min readనగరపాలక ఇన్చార్జ్ కమిషనర్ రామలింగేశ్వర్ కు వినతిపత్రం అందజేసిన ఆర్వీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ నుండి మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధులు ముత్తుకూరు గౌడప్ప గులాం రసూల్ ఖాన్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని నగరపాలక ఇన్చార్జ్ కమిషనర్ రామలింగేశ్వర్ కు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్,రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న,ఆర్వీపీఎస్ జిల్లా అధ్యక్షులు అశోక్,ఎర్రకోట మల్లప్ప మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ 1801 ప్రాంతంలోనే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి 15 రోజులపాటు వారితో యుద్ధం చేసిన గొప్ప వీరుడు ముత్తుకూరు గౌడప్ప అని దీనినే తెరినేకంటి ముట్టడిగా చరిత్రలో చెబుతారని 15రోజుల అనంతరం ముత్తుకూరి గౌడప్పను బంధించిన బ్రిటిష్ వారు తెర్నేకల్ ఊరవాకిలికి ముత్తుకూరు గౌడప్పను ఉరితీసారని బ్రిటిష్ వారితో ఎనలేని పోరాటం చేసిన ఆయన విగ్రహం జిల్లా హెడ్ క్వార్టర్ లో లేకపోవడం శోచనీయమని తక్షణమే ఆయన విగ్రహాన్ని కర్నూలు నగరంలో ఏర్పాటు చేయాలని వారు కోరారు. అలాగే 1839లో కర్నూలు నగరం వేదికగా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన వీరుడు గులాం రసూల్ ఖాన్ తర్వాత కాలంలో వారిచేత బంధింపబడి విషప్రయోగం చేత మరణించారని ఆయన విగ్రహం కూడా కర్నూల్ నగరంలో లేదని వారి వర్ధంతి జయంతి లకు సైతం పూలమాల వేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే రాయలసీమ ప్రాంత మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధులు ముత్తుకూరు గౌడప్ప,గులాం రసూల్ ఖాన్ ల విగ్రహాలను కర్నూలు నగరంలో నూతనంగా నిర్మిస్తున్న కూడళ్లలో ఏర్పాటు చేయాలని లేని పక్షంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి,యువజన,ప్రజా సంఘాలకు అవకాశం కల్పిస్తే తాము వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటామని అది మేము గౌరవంగా భావిస్తామని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో గురజాల అశోక్, వసంత్ కుమార్,రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్వీపీఎస్, బ్రిటిష్, స్వాతంత్ర సమరయోధులు,