PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మారుతి నగర్ అభివృద్దే నా లక్ష్యం

1 min read

– కౌన్సిలర్ లాలూ రవిశంకర్ వరప్రసాద్
– వార్డు సభలో సమస్యల వెల్లువ
– 200 కుటుంబాలు ఉన్న మాదిగలకు చర్చి స్థలం కేటాయించండి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ 12 వ వార్డు మారుతి నగర్ అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని కౌన్సిలర్ లాలు ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని మారుతీనగర్ కాలనీలో మంగళవారం వార్డు సభ కౌన్సిలర్ లాలూ మోహన్ రవిశంకర్ వరప్రసాద్. సచివాలయ సిబ్బంది వార్డు అడ్మిన్ రాహుల్, వెల్ఫేర్ అసిస్టెంట్ న్యామతుల్లా , అంగన్ వాడి సూపర్ వైజర్ అనురాధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ వార్డులో డ్రైనేజి కాలువలు, సీసీ రహదారులు, ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాకుండా ఎన్నికల ముందు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి లు మాదిగలు మారుతీ నగర్ కాలనీలో 200 కుటుంబాలు నివాసం వుంటున్నారని వారికి కేటాయించిన ఏ బి ఎం చర్చి స్థలంలో ఒక మహిళ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణ చేసిందని మాకు స్థలం చర్చికి ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు రెండేళ్ళుగా పట్టించుకోకుండా ఉన్నారని మాకు చర్చికి స్థలం కేటాయించాలని కోరారు. వార్డు మహిళలు పద్మమ్మ, గ్రేసమ్మ, లు మాట్లాడుతూ చర్చి కోసం 200 కుటుంబాలు మాదిగలు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఏ అధికారి పట్టించుకోవడం లేదని, చర్చి స్థలంలో ఒక మహిళ ఆక్రమించుకొని తను ఒక్కరే ఉంటే ఆమెకే ఎందుకు అధికారులు మద్దతిస్తున్నారని మాకు చర్చి స్థలాన్ని కేటాయించి అందరికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం కౌన్సిలర్ లాలూ మోహన్ రవిశంకర్ వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.1.50 కోట్ల పనులు సీసీ రహదారులు, డ్రైనేజి కాలువల పనులు చేశామన్నారు. మరి కొన్ని పనులను త్వరలో పూర్తి చేయిస్తున్నామన్నారు.అన్ని వార్డుల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. శాశ్వతంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు అలగనూరు రిజర్వాయర్ నుండి పైపులైన్ పనులు చేపడుతున్నారని తెలిపారు. చర్చి స్థలం విషయంలో మాదిగలకు న్యాయం చేసేలా బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, దాసి సుధాకర్ రెడ్డి దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరం చేస్తానన్నరు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు కె వి రమణ, యేసన్న, రాజినాల రవి,జాలంగారి నాగన్న, డ్రైవర్ స్వాములు, మద్దిలేటి, గంగాధర్ గౌడ్, రబ్బానీ, రంగస్వామి, సాగర్, ప్రవీణ్, టైలర్ బాషా, ఎం ఆర్ పి ఎస్ నాయకులు ప్రేమరాజు మాదిగ, విజ్జి మాదిగ, శ్యామ్, డేవిడ్, పద్మమ్మ, గ్రేసమ్మ, బండల యేసన్న, హోటల్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

About Author