PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచిత వైద్యం అందించ‌డ‌మే నా క‌ల : సోనూసూద్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: దేశ ప్రజ‌ల‌కు ఉచిత వైద్యం అందించ‌డ‌మే త‌న క‌ల అని ప్రముఖ న‌టుడు, రియ‌ల్ హీరో సోనూ సూద్ వెల్లడించారు. ఓ చాన‌ల్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ ప్రక‌ట‌న చేశారు. దేశ ప్రజ‌ల‌కు ఉచిత విద్య, వైద్యం అందించ‌డానికి పాఠ‌శాల‌లు, ఆస్పత్రులు ఏర్పాటు చేయాల‌ని ఉంద‌ని..కానీ అది ఇప్పుడు సాధ్యం అయ్యే ప‌ని కాద‌ని తెలిపారు. క‌రోన కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిని చూసి త‌న మ‌నసు చ‌లించిపోయింద‌ని, వారికి చేత‌నైన స‌హాయం చేయాల‌నే ముందుకు వ‌చ్చాన‌ని తెలిపారు. ఆస్పత్రులు ఏర్పాటు చేసి ప్రజ‌లకు ఉచిత వైద్యం అందించాల‌ని త‌న‌కు ఎప్పటి నుంచో ఉంద‌ని, అది మాత్రం త‌ప్పుకుండా చేస్తాన‌ని ప్రక‌టించారు. క‌రోన కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజ‌లు త‌న భార్య, పిల్లల సోష‌ల్ మీడియ ఖాతాల‌కు కూడ స‌హాయం కోసం మెసేజ్ లు చేస్తున్నార‌ని తెలిపారు. త‌న కుటుంబ స‌భ్యులు కూడ త‌న సేవ‌లో భాగ‌స్వామ్యం అవ‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపారు.

About Author