NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒలంపిక్స్ లో నా కొడుకు చ‌రిత్ర సృష్టిస్తాడు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భార‌త రెజ్లర్ ర‌వి ద‌హియా ఫైన‌ల్ కు వెళ్లాడు. అంద‌రినీ ఆశ్చర్యం, ఆనందంలో ముంచెత్తాడు. దీంతో ఆయ‌న స్వగ్రామంలో సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. ర‌వి ద‌హియా స్వగ్రామం హ‌రియాణ‌లోని న‌హ్రీ. 57 కిలోల విభాగంలో ఫైనల్ చేరుకుని రెజ్లర్ ర‌వి ద‌హియ ర‌జ‌తం ఖాయం చేసుకున్నాడు. దీంతో ఆయ‌న తండ్రి రాకేష్ సంబురాల్లో మునిగిపోయారు. విశ్వ క్రీడ‌ల్లో త‌న కుమారుడు విజ‌యం సాధిస్తాడ‌ని ర‌వి తండ్రి చెప్పారు. ఇప్పుడే త‌మ‌కు దీపావ‌ళిలా ఉంద‌ని, హ‌రియాణ‌తో పాటు దేశం మొత్తం గ‌ర్వప‌డేలా ర‌వి విజ‌యం సాధిస్తాడ‌ని ఆయ‌న తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. ఒలంపిక్స్ లో స్వర్ణ ప‌త‌కం సాధించి చ‌రిత్ర సృష్టిస్తాడ‌ని రాకేష్ చెప్పారు. భార‌త్ నుంచి రెజ్లింగ్ లో ఫైన‌ల్ కు చేరిన రెండో ఆట‌గాడు ర‌వి ద‌హియా. అంత‌కు ముందు బీజింగ్ ఒలంపిక్స్ లో సుశీల్ కుమార్ కాంస్యం సాధించాడు.

About Author