NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నా మాట‌లు వ‌క్రీక‌రించారు : సాయి ప‌ల్లవి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గో సంరక్షకులను, కశ్మీర్‌ పండిట్లను ఊచకోత కోసిన ఉగ్రవాదులను ఒకే గాటిన కట్టారంటూ తనపై వస్తున్న విమర్శలపై సినీనటి సాయిపల్లవి వివ‌ర‌ణ ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ వీడియో సందేశాన్ని ఉంచారు. తన మాటల్లో అసలు ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వక్రీకరణలు చేసి కొంతమంది తనను దోషిగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటల వల్ల ఎవరైనా బాధపడివుంటే క్షమించాలని కోరారు. ‘గత కొన్నిరోజులుగా నా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ జరుగుతున్న ప్రచారానికి సంబంధించి స్పష్టత ఇచ్చేందుకే మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు కూడా నా అభిప్రాయాన్ని చెప్పాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. మళ్లీ నా మాటలు వక్రీకరించవచ్చు. ఇంటర్వ్యూలో నన్ను మీరు లెఫ్ట్‌ వింగ్‌కి మద్దతిస్తారా? రైట్‌ వింగ్‌కా? అని అడిగారు. నేను దేనికి మద్దతు ఇవ్వడం లేదు అని స్పష్టంగా చె ప్పాను. ఆ ఇంటర్వ్యూను ముక్కలు ముక్కలుగా చేసి వైరల్‌ చేశారు. మనం ముందు మంచి మనుషులుగా ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం“ అని అన్నాన‌ని సాయిప‌ల్ల‌వి తెలిపారు.

                                          

About Author