కేసీఆర్ తో మమత ఫోన్ సంభాషణ !
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణ సీఎం కేసీఆర్కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్ చేశారు. 15న ఢిల్లీకి రావాలని కేసీఆర్ను మమత ఆహ్వానించారు. ఎన్డీయేతర పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలను ఏకం చేసేందుకు యత్నిస్తున్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని విపక్షాలకు మమత పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే 22 మంది విపక్ష నేతలకు మమతా బెనర్జీ లేఖ రాశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసీఆర్ హడావుడి పర్యటనలు చేశారు. ఇప్పటికే తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్ సీఎంలతో పాటు పలువురి ప్రముఖులకు మమతా బెనర్జీ లేఖలు రాశారు.