NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పౌరాణిక పద్య నాటక ప్రదర్శనలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరం నందలి శ్రీరామ నగర్ లో గల శ్రీశైల భ్రమరాంబిక కళా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు డి పుల్లయ్య సారధ్యంలో శ్రీరామనవమి సందర్భంగా గొప్ప పౌరాణిక పద్య నాటక ప్రదర్శనలు పంచమాంకములు వరుసగా దుర్యోధన ఏకపాత్ర పడక శీను గయోపాఖ్యానం శ్రీకృష్ణ తులాభారం సత్య హరిచంద్ర స్థానిక కళాకారులచే గొప్ప పౌరాణిక పద్య నాటక ప్రదర్శనలు 29వ తేదీ బుధవారం రాత్రి 8 గంటలకు శ్రీరామ్ నగర్ నందలి శివాలయం దగ్గర పంచమాంకములు ప్రదర్శించబడును. కళాకారులకు ముఖ్య గౌరవ అతిధులు వై నాగేశ్వరరావు యాదవ్ బి పుల్లయ్య పెరుగు పురుషోత్తం రెడ్డి ప్రభాకర్ యాదవ్ పి వెంకటేశ్వర్లు మక్కల శ్రీనివాసులు కటారి సురేష్ సయ్యద్ రోషన్ అలీ సి బి అజయ్ కుమార్ పి దస్తగిరి ఎన్ వి సుబ్బయ్య ఆనందరావు యన్ జీవన్ కుమార్ కర్నూలు డివిజన్ కార్పొరేటర్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం శ్రీశైల భ్రమరాంబ కళా సమితి అధ్యక్షులు డి పుల్లయ్య సమన్వయకర్త బైలుప్పల షఫీయుల్లా మరియు శ్రీరామనగర్ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడును. కావున కళాకారులు కళాభిమానులు తప్పక హాజరు కాగలరని మనవి.

About Author