ఎన్-95 మాస్క్.. ఎన్నిసార్లు వాడొచ్చో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన మహమ్మారి రాకతో ఎన్-95 మాస్కుల వాడకం పెరిగిపోయింది. వీటిని శుభ్రం చేసి తిరిగి వాడే అవకాశం లేకపోవడం వల్ల.. వాడిన తర్వాత పడేయాల్సి వస్తోంది. దీనిని గమనించిన అమెరికన్ శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఈ విధానంలో ఎన్-95 మాస్కులను ఏకంగా 25 సార్లు శుభ్రం చేసి వాడుకోవచ్చు. ఈ క్రమంలో వాటి ప్రొటెక్షన్ కెపాసిటీ ఏమాత్రం తగ్గదు. ఎన్-95 మాస్కులను ఆరోగ్య సిబ్బంది ఎక్కువగా వాడుతున్నారు. శుభ్రం చేసే అవకాశం లేకపోవడం వల్ల.. కొత్త మాస్కుల అవసరం ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని బెథ్ ఇజ్రాయిల్ డీకోనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు వేపరైజ్డ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ను తెరమీదకి తెచ్చారు. ఇది సాధారణ క్రిమినాశక రసాయనం. ఇది ఉపయోగించి ఎన్-95 మాస్కులను శుధ్ది చేయవచ్చు. దీనితో శుభ్రం చేసినా మాస్కుల సామర్థ్యం ఏమాత్రం తగ్గదని శాస్త్రవేత్తలు తెలిపారు.