ఎస్డిపిఐ ఎపి రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్.అబ్దుల్ సుభాన్
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/4-5.jpg?fit=550%2C584&ssl=1)
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టిపిఐ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ నూతన కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా హెూలగుంద గ్రామానికి చెందిన ఎస్ డి పి ఐ నాయకులు ఎన్. అబ్దుల్ సుభాన్ ను ఎన్నుకున్నట్లు రాష్ట్ర కమిటీ మంగళవారం ఓ ప్రకటనలో విడుదల చేసింది. దీంతో మండలంలోని ఎస్ డి పి ఐ నాయకులలో నూతన ఉత్సాహం నెలకొంది. నూతనంగా ఎన్నికైన ఏపీ రాష్ట్ర ఎస్ డి పి ఐ కార్యదర్శి మాట్లాడుతూ పార్టీ పెద్దలు నాయకులు తమను గుర్తించి బాధ్యతతో రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినందుకు వారికి శుభాభినందనలు తెలిపారు. అలాగే పార్టీ పెద్దలు ఇచ్చిన గుర్తింపుకు మన్నికగా పార్టీ అభివృద్ధికి గ్రామస్థాయి నుండి కృషి చేస్తానని ఆయన అన్నారు.