స్వచ్ఛంద సంస్థల సిబ్బందికి నాబార్డ్ శిక్షణ
1 min read– శిక్షణలో స్వచ్ఛంద సంస్థల సిబ్బందికి పలు సూచనలు చేసిన డి. డి. ఎం. సుబ్బారెడ్డి
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నంద్యాల జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల సిబ్బందికి నాబార్డ్ వారి ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థల సిబ్బంది మరియు రైతు ఉత్పత్తి దారుల సంఘాల బోర్డు సభ్యులు, అలాగే CEO లు పాల్గోన్న ఈ శిక్షణ శిబిరంలో నాబార్డ్ చేస్తున్న వాటర్ షెడ్, గిరిజనాభి వృద్ధి మరియు FPO ల కార్యక్రమాల గురించి D. D. M.సుబ్బా రెడ్డి అవగాహన కల్పించారు. నిర్దేశించుకున్న ప్రణాళిక పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు.FPO ల ఏర్పాటు, తీసుకోవలసిన జాగ్రత్తలు, బిజినెస్ కార్యక్రమాల గురించి ఆయన వివరించారు.జిల్లాలో రైతు సంఘాలు బలోపేతం కావాలని, మార్కెటింగ్ సదుపాయాలను మెరుగు పరచుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అలాగే ప్రాజెక్ట్ పనుల్లో అలసత్వం తగదని అన్నారు.క్షేత్ర స్థాయిలో గల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను స్వచ్ఛంద సంస్థల సిబ్బందికి సూచించారు.ఈ శిక్షణా కార్యక్రమం లో నవ యూత్ అసోసియేషన్, అపార్డ్, ఎఫెర్ట్ మరియు WCUSS స్వచ్ఛంద సంస్థల సిబ్బంది మరియు ప్యాపిలి, తుగ్గలి, నందికొట్కూరు, గడివేముల, మహానంది, డోన్ మండలాల FPO ల సిబ్బంది మరియు FPO సభ్యులు పాల్గోన్నారు.