నాదెండ్ల మనోహర్ కు స్వాగతం పలకనున్న జనసేన పార్టీ ఇన్చార్జి
1 min read
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జనసేన పార్టీ రాష్ట్ర పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 8గం.లకు ఏలూరు మీదుగా వెళ్ళనున్నారు.ఏలూరు జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ జిల్లా నాయకులు, నగర కమిటీ నాయకులు, మహిళా కమిటీ నాయకులు, జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఉదయం 8 గంటలకు కలపర్రు టోల్ గేట్ వద్ద జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు హాజరుకావాలని ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్ ఒక ప్రకటనలో కోరారు.