PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విడాకుల పై తొలిసారి స్పందించిన నాగ‌చైత‌న్య !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌మంత‌తో విడాకుల అంశం పై ప్ర‌ముఖ న‌టుడు నాగ‌చైత‌న్య స్పందించారు. `నా వ్యక్తిగత జీవితం గురించి అందరు మాట్లాడుకోవడం అసహనం కలిగిస్తోంది. ప్రతి ఒక్కరికీ పర్సనల్‌ లైఫ్‌ అనేది ఉంటుంది. సమంతతో విడాకులపై ఇప్పటికే ప్రకటన చేశాం. అయితే దానికి కారణమేంటో ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు జీవిస్తున్నాం. సమంత దారి సమంతదే.. నా దారి నాదే. ఇంతకంటే ఇంకా చెప్పాల్సిందేమి లేదు’ అంటూ ఘాటూగా స్పందించాడు. అనంతరం తనపై వస్తున్న రూమర్స్‌ని తానేప్పుడ పట్టించుకోనని, మొదట్లో ఆలోచించేవాడినని, కానీ ఇప్పుడు ఆ రూమర్స్ గురించి అంతగా ఆలోచించడం లేదని చై అన్నాడు.

                                

About Author