విష్ణు మేకప్ మెన్ కు నాగబాబు ఆర్థిక సాయం.. మంచు ఫ్యామిలీ రియాక్షన్ ఇదే !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇటీవల మంచు విష్ణు మేకప్ మెన్ నాగశ్రీను దొంగతనం చేసినట్టు.. విష్ణు పీఏ పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. తననే దూషించి, తీవ్రంగా అవమానించారని.. అందుకే అక్కడ ఉద్యోగం మానేసినట్లుగా తెలుపుతూ.. ఓ వీడియోని విడుదల చేయడంతో ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారింది. మంచు ఫ్యామిలీ నుండి ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెబుతున్న నాగ శ్రీనుకు.. తాజాగా మెగాబ్రదర్ నాగబాబు రూ. 50 వేలు ఆర్థిక సాయం చేశారు. హెయిర్ డ్రెస్సెర్ ఉప్పలపు నాగ శ్రీను తల్లి ఆరోగ్యం మరింత క్షీణించడం, అతనికి గత సంస్థ నుండి జీతం కూడా సరిగ్గా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాడనే విషయం తెలిసి.. నటుడు నిర్మాత నాగబాబు చిరు సాయంగా 50,000/- రూపాయలు అందించారు. దీనిపై మంచు ఫ్యామిలీ స్పందిస్తూ ‘‘ప్రతి నెల మా సంస్థ నుంచి అతనికి కరెక్ట్‌గానే శాలరీ డిపాజిట్ చేయడం జరిగింది. గత నెల కూడా శాలరీ డిపాజిట్ చేశాము’’ అని మంచు ఫ్యామిలీ తరపు పీఆర్ తెలిపారు.