NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలీవుడ్ లోకి నాగ‌బాబు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్​: మెగా బ్రద‌ర్ నాగబాబు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడ‌న్న వార్తలు గుప్పుమంటున్నాయి. నాగ‌బాబు బాలీవుడ్ ఎంట్రీ.. టాలీవుడ్ హాట్ టాక్ గా మారింది. రాజ‌మౌళి ద‌ర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెలుగులో బాక్సాఫీస్ షేక్ చేసిన ‘ఛ‌త్రప‌తి ’ సినిమాని… బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లోకి రీమేక్ చేయ‌బోతున్నారు. ఈ రీమేక్ కి వి.వి. వినాయ‌క్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నార‌నే వార్తలు వినిపిస్తున్నాయి. ఛత్రప‌తి బాలీవుడ్ రీమేక్ లో నాగ‌బాబు కీల‌క‌మైన విల‌న్ పాత్ర పోషిస్తాడ‌నే పుకారు షికారు చేస్తోంది. ఇప్పటికే చిత్ర బృందం నాగ‌బాబును సంప్రదించిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. నాగ‌బాబు నుంచి కానీ..చిత్ర బృందం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రక‌ట‌న రాలేదు.

About Author