NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈనెల 21న కర్నూలుకు రానున్న నాగబాబు

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : ఈ నెల 21 న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ.కొణిదెల నాగబాబు కర్నూలు కు రానున్నట్లు జనసేన పార్టీ పత్తికొండ నియోజక వర్గ ఇంచార్జ్ సీ.జే.రాజ శేఖర్ గురువారం విలేకరులకు తెలిపారు. వీరమహిళ, జనసేన కార్యకర్తల సమీక్ష సమావేశం ఈనెల 21న శనివారం ఉదయం 10:00 గంటలకు పరిణయ ఫంక్షన్ హాల్, మౌర్య ఇన్ కర్నూల్ లో ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఈ సమావేశంలో ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గం పార్టీ బలోపేతమే లక్ష్యంగా నియోజకవర్గ, మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు దిశగా చర్చ చేపడుతున్నట్లు చెప్పారు. కావున పత్తికొండ నియోజకవర్గ జనసేన నాయకులు వీరమహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పత్తికొండ నియోజకవర్గం నాయకులు సీజీ రాజశేఖర్ పిలుపునిచ్చారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఒకసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తులు వందల కోట్ల ఆస్తులు కూడా పెట్టుకునే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడించబడిన ప్రజల తరఫున ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ అప్పుల బాధతో చనిపోయిన 3000 కౌలు రైతు కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 30 కోట్ల రూపాయలు తన కష్టార్జితంతో సంపాదించిన డబ్బులను కౌలు రైతు కుటుంబాలకు అండగ నిలుస్తున్న పవన్ కళ్యాణ్ గారిని 2024లో ముఖ్యమంత్రి చేసుకోవలసిన బాధ్యత పత్తికొండ నియోజకవర్గం ప్రజల అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ధర్మతేజ, చాంద్ బాషా, వడ్డే వీరేష్, జీవన్, తదితరులు పాల్గొన్నారు.

About Author