NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సినిమా టికెట్ ధ‌ర‌ల పై నాగార్జున స్పంద‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు పై ప్ర‌ముఖ న‌టుడు నాగార్జున స్పందించారు. బంగార్రాజు సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ‘‘ సినిమా వేదికపై రాజకీయాల గురించి మాట్లాడను. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు వాయిదా పడినందుకు చాలా బాధగా ఉంది. కానీ అవి పాన్ ఇండియా సినిమాలు. ఒమైక్రాన్ ప్రభావం కారణంగా ఆ సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ సినిమాల కోసం వారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కానీ ఒమైక్రాన్ ప్రభావం అలా ఉంది. ఏపీలోని సినిమా టికెట్ల ధరలపై నాకేమీ ఇబ్బంది లేదు. అంటే నా సినిమా వరకు ఇబ్బంది లేదు. ధరలు ఎక్కువుంటే కొంచెం డబ్బులు ఎక్కువస్తాయి. తక్కువ ఉంటే తక్కువ వస్తాయి. సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలైనా సరే.. మూడు సినిమాలకు స్కోప్ ఉంటుంది. నాన్నగారి టైమ్‌లో, మా టైమ్‌లో సంక్రాంతికి 5 సినిమాలు ఆడాయి. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ‘బంగార్రాజు’ని విడుదల చేస్తున్నాం..’’ అని నాగార్జున అన్నారు.

                             

About Author