PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాగచైత‌న్య‌, స‌మంత విడాకుల పై నాగార్జున స్పంద‌న !

1 min read

Naga Chaitanya at CBL Telugu Thunders Team Jersey Launch

ప‌ల్లెవెలుగువెబ్ : నాగచైతన్య, సమంత జోడీ విడిపోయి చాలాకాలం అయినా ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. వారు ఎందుకు విడిపోయారన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో, జాతీయ మీడియా సంస్థ ‘పింక్ విల్లా’ నాగార్జునను ఈ అంశంపై స్పందించాలని కోరింది. అందుకు నాగార్జున స్పందిస్తూ… “నాగచైతన్య ఇప్పుడు హ్యాపీగా కనిపిస్తున్నాడు. నాకది చాలు. అంతకంటే నేను ఇంకేమీ కోరుకోను. గతంలో అతడి జీవితంలో జరిగిన వ్యవహారం అంటారా…. అదొక అనుభవం. దురదృష్టకరమైనది. దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోలేం. ఆ వ్యవహారం ముగిసిపోయింది. మా జీవితాల నుంచి తీసేశాం. ఇతరులు కూడా దాని గురించి ఇక ఆలోచించరని భావిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.

                                           

About Author