నాయి బ్రాహ్మణులు క్రమశిక్షణ.. ఐకమత్యంతో మెలగాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నాయి బ్రాహ్మణ సంఘం సంఘీయులు క్రమశిక్షణతో మెలగాలని, పట్టణంలో నాయి బ్రాహ్మణులు అంటే ఎంతో విలువలు ఉన్నాయని, అందరూ తీర్మానాలకు కట్టుబడి ఉండాలని. నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మూలింటి చంద్రశేఖర్ హితవు పలికారు.పత్తికొండ స్థానిక పెద్ద ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం అనేక తీర్మానాలతో అమావాస్య సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు మూలింటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, పత్తికొండ పట్టణంలో నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, నాయి బ్రాహ్మణులు అనేక కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా చేపడుతున్నారని అన్నారు. గతంలో నాయి బ్రాహ్మణులు కాలనీ కోసం అప్పటి పెద్దలుసుబ్బన్నపెద్దఆంజనేయులు. ఆంజనేయులు.గోవిందరాజులు దూదే కొండ శీను పోస్ట్ ఆంజనేయులు, కృష్ణమూర్తి బళ్లారి కృష్ణమూర్తి వీరితోపాటు అప్పటి సంగం యువ నాయకులు జయరాముడు, లింగన్న రవిచంద్ర వెంకటేశ్వర్లు ఐకమత్యంతో పని చేయడం వల్లనే నాయి బ్రాహ్మణ కాలనీ ఏర్పడిందని అన్నారు. ఇప్పుడు ఆ కాలనీ ఎంతో విలువైన కాలనీగా విరాజుల్లుతుందని, అంతేకాకుండా ఆ కాలనీలో ఎన్నో లక్షలతో ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించడానికి ఇప్పుడు ఉన్న నాయి బ్రాహ్మణ సంఘం కమిటీ తో పాటు పెద్దలు సహకారంతో ఆలయాన్ని పూర్తికావచ్చిందని తెలిపారు. నాయి బ్రాహ్మణులకు ఏ ఇబ్బందులు వచ్చినా నాయి బ్రాహ్మణ సంఘం ఉందని నాయి బ్రాహ్మణ సంఘానికి ఒక కట్టుబాటు ఉంటుందని దాన్ని గౌరవించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క న్యాయ బ్రాహ్మణ సంఘీయుడిదని ఆయన తెలిపారు. అలాగే నాయి బ్రాహ్మణులు ఐకమత్యాన్ని వీడ రాదనిి అన్నారు. ప్రతి సంఘంలో ప్రతి చోట స్వార్ధపరులు నిస్వార్ధపరులు ఉంటారని స్వార్థపరుల మాటలకు బలహీనులై సంఘాన్ని బలహీనపరచవద్దని సంఘం బలంగా ఉంటే మన కుటుంబాలు కూడా బలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఏ కష్టం వచ్చినా ఒకే సంఘం గా ఉండి ఏ పనైనా సాధించవచ్చని లేనిపక్షంలో ఏ పనులు జరిగే పరిస్థితులు లేవని దానికి నిదర్శనమే మన నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రావణ మాస ఉత్సవాలే అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి నరసింహులు, వార్డు మెంబర్ లింగన్నన, జిల్లా నాయకులు రవిచంద్ర కుమార్, నందా, పోస్ట్ ఆంజనేయులు, రఘు. రాముడు, భగవంతు, వెంకటేష్, నాగ, రామంజి, తదితరులు పాల్గొన్నారు.