PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న‌గ్నంగా బైక్ రైడ్

1 min read

అత‌నో బైక్ దొంగ‌. దొంగ‌త‌నం చేశాడు. అంత‌టితో ఊరుకోలేదు. ఆ బైక్ మీదే బ‌ట్టలు లేకుండా.. న‌గ్నంగా బైక్ రైడ్ చేశాడు. న‌గ‌రమంతా బ‌ట్టలు లేకుండా బైక్ మీద షికారు చేశాడు. పోలీసులు స‌మాచారం అందుకుని .. ప‌ట్టుకునేలోపు బైక్ వ‌ద‌లి తుర్రుమ‌న్నాడు. ఆ ‘నగ్న చోరుడి’ కోసం ఇప్పుడు హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీసులు గాలిస్తున్నారు. చిక్కితే ఓ చోరీ కేసు ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఓ గుర్తుతెలియని యువకుడు గత వారం లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు. దీనిపై స్థానిక పీఎస్‌లో కేసు నమోదైంది. ఆ చోరుడు మూడు రోజుల క్రితం పట్టపగలు ఆ వాహనాన్ని తీసుకుని నగ్నంగా షికారుకు బయలుదేరాడు. మూడు కమిషనరేట్ల పరిధిలోనూ ఈ గాలింపు కొనసాగుతోంది. ప్రధానంగా లంగర్‌హౌస్‌ సహా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలిస్తున్నారు. ఆ యువకుడు నగ్నంగా బైక్‌ నడుపుతుండగా మిలటరీ ఏరియాలో వెనుక నుంచి వెళ్తూ కొందరు వాహన చోదకులు వీడియో తీశారు. ఆ ప్రయత్నంలో అతడిని పిలుస్తున్నా పలకకుండా, తల కూడా తిప్పకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. అతగాడు మతిస్థిమితం లేక ఇలా చేశాడా? స్నేహితులు లేదా పరిచయస్తులతో పందాలు కాసి అలా ప్రవర్తించాడా? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

About Author