NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నల్లమల ఘాట్ రోడ్​లో తప్పిన ప్రమాదం

1 min read

 పల్లెవెలుగు మహానంది: నల్లమల ఘాట్ రోడ్ లో పెను ప్రమాదం తప్పింది .నంద్యాల గిద్దలూరు రహదారిలోని నల్లమల ఘాట్ రోడ్ లో ఒక లారీ రెండు వాహనాలను ఢీకొంది. ఒంగోలు వైపు నుండి జొన్నల లోడుతో వస్తున్న లారీ అదే రహదారిలో లారీ ముందు బాగాన పోతున్న ఒక కారును ఢీకొట్టడంతో పాటు  నంద్యాల వైపు నుండి ఎదురుగా వస్తున్న స్కార్పియో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఒక వాహనం దెబ్బ తిన్నది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదని తెలుస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి  మహానంది ఎస్ఐ నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  పేర్కొన్నారు.

About Author