పేర్ని నాని గారు.. త్రివిక్రమ్ కు ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ లో టికెట్లు అమ్మాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో .. సినిమా టిక్కెట్ల రేట్ల విషయంపై దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఓ ట్వీట్ సంచలనం రేపుతోంది. ‘‘చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒకటే టికెట్ రేటు అన్నట్లుగానే ప్రతి స్కూల్లోనూ ఒకటే ఫీజు, ప్రతి ఆసుపత్రిలోనూ ఒకటే బిల్లు ఎందుకు పెట్టరు? పేదవాడికి విద్యా, వైద్యం కంటే సినిమా ఎక్కువా?“ అన్నది ఆ ట్వీట్ ఉద్దేశం. అయితే ఆ ట్వీట్ చేసింది దర్శకుడు త్రివిక్రమ్ అని అభిప్రాయపడిన ఏపీ మంత్రి పేర్ని నాని ఓ కార్యక్రమంలో ఆ ట్వీట్ గురించి ప్రస్తావించారు. త్రివిక్రమ్ ట్వీట్‌ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. అయితే… ఈ ట్వీట్ గురించి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ స్పందించింది. త్రివిక్రమ్ కు ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవని, ఆయనకు సంబంధించిన స్టేట్ మెంట్స్ ఏవైన తమ సంస్థ అధికారిక ఖతా నుంచే వస్తాయని తెలిపింది. లేదంటే ఫార్చూన్ 4 సినిమాస్ ట్విట్టర్ ఖాతా నుంచి వస్తాయని తెలిపారు. త్రివిక్రమ్ కు ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవని, ఆయన పేరు మీద వచ్చిన ఎలాంటి స్టేట్ మెంట్ నమ్మవద్దని తెలిపారు.