PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

“సర్దార్ గౌతు లచ్చన్న “సభా ప్రాంగణం గా నామకరణం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు : బహుజన వర్గాలు ఆత్మగౌరవంతో జీవించాలని ఉన్నత స్థాయి ఎదగాలని ,తన జీవితకాలం కృషి చేసిన సర్దార్ గౌతు లచ్చన్న స్ఫూర్తి తో ఆ మహనీయుని ఆశయ సాధనకు ఆ వర్గాల యువత ముందుకురావాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు అన్నారు. ఉయ్యూరు బైపాస్ రోడ్ అయ్యప్ప గుడి సమీపంలోని గ్రీన్ ల్యాండ్ రిసార్ట్స్ లో ఏప్రిల్ 14 న నిర్వహించతలపెట్టిన బహుజన సాహిత్య అకాడమీ 3 వ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కాన్ఫరెన్స్ ఏర్పాట్లకు బి.ఎస్. ఏ స్థానిక ప్రతినిధులు బుధవారం శ్రీకారం చుట్టారు. బి,. ఎస్ .ఏజాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ నేతృత్వంలో సంస్థ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షులు జంపాన శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం భారీగా జరగనుంది. ఈ నేపథ్యంలో నిర్వహించనున్న సభవేదికకు స్వాతంత్ర సమరయోధులు బడుగు వర్గాల ఉద్యమ నేత సర్దార్ గౌతు లచ్చన్న సభా ప్రాంగణంగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు ” సర్దార్ గౌతు లచ్చన్న” సభా ప్రాంగణ బోర్డును ఆవిష్కరించారు. దివంగత గౌతు లచ్చన్న చిత్తరువుకి నివాళులర్పించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ బహుజనుల శ్రేయస్సు కోసం వారిని చైతన్య పరిచే సాహితీ వికాసం కోసం బహుజన సాహిత్య అకాడమీచేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బి.సి.సంక్షేమ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాజుగట్టు శివ,మైనార్టీ నాయకులు మైనార్టీ నాయకులు కాలీల్ రెహమాన్బి.ఎస్.ఏ.ప్రతినిధులు కాటూరి సురేష్,కె.గౌతమి,కోలా దుర్గా భావాని ,నారగాని రజని, తదితరులు పాల్గొన్నారు.

About Author