నాంపల్లి కోర్టు సమన్లు సీఎం జగన్ కు అందలేదు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాంపల్లి కోర్టుకు హాజరు కావాలని జారీ చేసిన సమన్లు ఆయనకు అందలేదని న్యాయవాదులు న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఈ నెల 31వ తేదీలోపు జగన్‌కు సమన్లు సర్వ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు గత గురువారం ఏపీ సీఎంకు సమన్లు జారీ చేసింది. 28న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుజుర్‌నగర్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైఎస్ జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిపై ఈసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది.