NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నందికొట్కూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

1 min read

– అఖిలభారత కిసాన్ మహాసభ రైతు సంఘం.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని అఖిల భారత కిసాన్ మహాసభ రైతు సంఘం జిల్లా కార్యదర్శిపిక్కిలి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం  స్పందన కార్యక్రమంలోతహసిల్దార్ రాజశేఖర్ బాబు  ఎంపీడీవో శోభారాణి   విద్యుత్ శాఖ అధికారి ఏ డి ఏ శ్రీనివాసులు లకు  వినతి పత్రం అందజేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ  ఖరీఫ్ సీజన్ లో  రైతులు మొక్కజొన్న , పత్తి , ఉల్లి, మిరప, కొర్ర , కంది, మినుము, పెసర, తదితర పంటలుసాగు చేశారని వర్షాలు లేక పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. మొక్కజొన్న  ఎకరాకు 10 క్వింటాలు  కూడా రావడం లేదన్నారు. పత్తి పూర్తిగా తెగుళ్లు సోకి ఎండిపోవడం జరిగిందన్నారు. అందువల్ల తక్షణమే ప్రభుత్వం నందికొట్కూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని  రైతులకు, కౌలు రైతులకు రెండు లక్షల  రుణమాఫీ చేయాలని ,రైతుల రుణాలు రీ షెడ్యూలు చేయాలని డిమాండ్ చేశారు.  మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు 200 రోజులు కల్పించాలని రోజువారి కూలీ రూ. 600 లు ఇవ్వాలని  వలసలను నివారించాలని కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని కోరారు. లేకపోతే రైతు వ్యవసాయ కూలీల సమీకరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో నాయకులు.బి ఉపేంద్ర ,ఎన్. కృష్ణుడు, వడ్డే చిన్నన్న , రాజు సుధాకర్ ,సామేలు ,తదితరులు పాల్గొన్నారు.

About Author