నందికొట్కూరు టీడీపీలో భగ్గుమంటున్న విభేదాలు
1 min read– కార్యకర్తలు నాయకులు రెండు వర్గాలుగా చీలిక
– ఒకరి ఆధిపత్యం పై మరొకరు విమర్శలు
– కాకరవాడ చిన్న వెంకటస్వామిని దూరం చేసేందుకు అంతర్గత కుట్ర
– నందికొట్కూరులో చిన్న నాయకత్వాన్ని జీర్ణించుకోలేక పోతున్నా కొందరు నేతలు ఎవరు ?
– తెర వెనుక ఉండి నడిపిస్తున్న నాయకుడు ఎవరు ?
– టికెట్ కోసం మొదలైన టీడీపీ కుమ్ములాటలు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో నాయకులు కార్యకర్తల మద్య విబేధాలు భగ్గుమంటున్నాయి. ఎవరికీ వారు యమునా తీరే అంటూ కార్యకర్తలు కూడకట్టుకొని కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో ఒకరి నాయకత్వాని మరొకరు జీర్ణించుకోలేక పోతున్నారు. టీడీపీకి చెందిన కార్యక్రమాలలో ఒకరినొకరు పలకరించుకుంటారా అంటే అదికూడా లేదు. దీని వల్ల కార్యకర్తలకు అర్థం కాక అయోమయంలో పడ్డారు. తాజాగా నందికొట్కూరు పట్టణంలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం ఉదయం జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే 197 వ జయంతి వేడుకల సందర్భంగా సోమవారం టీడీపీ విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం దుమారం రేపుతోంది. నందికొట్కూరు నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది. అయితే ప్రస్తుతం పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్న టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి జయసూర్య లు పార్టీ టిక్కెట్ కోసం ఒకరికొకరు పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరు వెంకట రెడ్డి ఒక నేతకు నీకే టిక్కెట్ అని చెప్పగా నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానంద రెడ్డి నీకే టిక్కెట్ అని చెప్పినట్లు సమాచారం. అయితే ఇద్దరు నాయకులు కూడా నియోజకవర్గంలో తిరిగి పార్టీని బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే గత ఏడాదిన్నర రోజులుగా కాకరవాడ చిన్న వెంకటస్వామి, జయసూర్యలు ఇద్దరు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పార్టీ ని నియోజకవర్గంలో కాకరవాడ చిన్న వెంకటస్వామి గత కొంత కాలంగా మాండ్ర శివానంద రెడ్డి , గౌరు వెంకటరెడ్డి ల ఆదేశాల మేరకు పార్టీ బలోపేతం కొరకు కృషి చేస్తున్నారు. పార్టీ ఆదేశించిన ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం, బాదుడే బాదుడు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.వైకాపా పార్టీని ఎండగట్టే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధిష్టానం కాకరవాడ చిన్న వెంకటస్వామి కి టిక్కెట్ ఇస్తారని ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కానీ అధికార పార్టీ కి చెందిన నేతలు కాకరవాడ చిన్న వెంకటస్వామిని అవాయిడ్ చేసి అతన్ని దూరం పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే గత రెండు రోజుల క్రితం జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నందికొట్కూరు నియోజకవర్గంలో సదరు నేతల వర్గవిభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి రాకముందే రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి జయసూర్య పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకరవాడ చిన్న వెంకటస్వామి వచ్చాక పార్టీకి చెందిన నేతలు ఎవ్వరు రాకపోవడంతో బిసి పట్టణ అధ్యక్షుడు వేణు గోపాల్ మరో వర్గం నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాకు పిలులేకుండా మీ ఇష్టారాజ్యంగా కార్యక్రమాలు జరుపుతున్నారంటూ అసంతృప్తి వెలగక్కారు. టిడిపి లోని కుమ్ములాటలు గమనిస్తున్న కార్యకర్తలు సందిగ్ధంలో ఉన్నారు. మండల నాయకులు, కార్యకర్తలు ఎవరి నాయకత్వంలో నడవలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని కొందరు కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో టీడీపీ కి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.