NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

18న నంద్యాల జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు

1 min read

– సెట్కూరు ముఖ్య నిర్వహణాధికారి పి.వి.రమణ

పల్లెవెలుగు వెబ్​:జిల్లా యువజన సంక్షేమశాఖ / సెట్కూరు ఆధ్వర్యంలో 15-29 లలోపు యువ కళాకారులకు  నవంబర్ 18న మునిసిపల్ టౌన్ హాల్ లో జిల్లా స్థాయి యువ సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు సెట్కూరు సీఈఓ పి.వి. రమణ పేర్కొన్నారు. పోటీలో భాగంగా  1) శాస్త్రీయ సంగీతం (కర్నాటిక్, హిందూస్థానీ) 2) శాస్త్రీయ నృత్యం (భరత నాట్యం, కూచిపూడి, మణిపురి, కథక్, ఒడిస్సి, కథక్)  3) శాస్త్రీయ వాయిద్య పరికరాలు (వీణ, సితార, తబలా, మృదంగం, గిటార్, హార్మోనియం, ఫ్లూట్),  4) జానపద నృత్యాలు (గ్రూప్) 5) జానపద గీతం (గ్రూప్), 6) వన్ ఆక్ట్ ప్లే (గ్రూప్ – హిందీ / ఇంగ్లీష్),    7) వకృత్వం (హిందీ / ఇంగ్లీష్) మరియు అదనపు అంశాలు తెలుగులో 1) వకృత్వం, 2) క్విజ్, 3) మోడరన్ సాంగ్ (సోలో), 4) మోడరన్ డాన్స్ (సోలో) 5) మ్యాజిక్ 6) మిమిక్రీ, 7) మోనో ఆక్షన్ 8) వెంట్రిలాక్విజం  9) వయోలిన్ 10) పెయింటింగ్ 11) ఫాన్సీ డ్రెస్ 12) గ్రూప్ డిస్కషన్ మొదలగు అంశాలలో నిర్వహించబడుచున్నవి. ఫై పోటీలలో పాల్గొనదలచిన కళాకారులు తమ పేరు లేక బృందం పేరును వెబ్ లింక్  ద్వారా నమోదు చేసుకోమని కోరియున్నాము. ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవడానికి వీలుకాని వారు నేరుగా పోటీలు నిర్వహించు వేదిక  కు తేదీ 18-11-2022 నాడు ఉదయం 09.00 గంటల లోపు వచ్చి నమోదు చేసుకొనవచ్చును. జిల్లా స్థాయి మొదటి స్థానంలో నిలిచిన విజేతలను డిసెంబర్ 1 లేదా 2 వ వారములో నిర్వహించబడు రాష్ట్ర స్థాయి పోటీలకు, రాష్ట్ర స్థాయి మొదటి స్థానంలో నిలిచిన విజేతలను జనవరి 2023 లో నిర్వహించబడే జాతీయ స్థాయికి మొదటి పోటీలకు  ప్రభుత్వ ఖర్చులతో పంపబడును. కావున యువ కళాకారులందరూ, విద్యార్థిని, విద్యార్థులు తేదీ 18-11-2022 ఉదయం 9.00 గంటల లోపు హాజరు అయి నంద్యాల జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలలో పాల్గొనాలని కోరడమైనది.

About Author