CCS CI, SI .. సిబ్బందిని అభినందించిన నంద్యాల జిల్లా ఎస్పి
1 min read– అంతర్రాష్ట్ర కంజర్బట్ ముఠా సభ్యలు అరెస్ట్ వారి వద్ద నుంచి చోరీ చేసిన సొమ్ము స్వాధీనం
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె. రఘువీర్ రెడ్డి IPS గారు, మరియు Addl .SP శ్రీ R. రమణ గారి ఆదేశాల మేరకు డోన్ SDPO శ్రీ Y. శ్రీనివాస రెడ్డి గారి ఆద్వర్యంలో నంద్యాల CCS CI శ్రీ పి . రామకృష్ణ గారు, శ్రీనివాసులు SI CCS నంద్యాల, ప్యాపిలి పోలీసు స్టేషన్ SI శ్రీ CM రాకేష్ గారు, సిబ్బంది కలిసి ఈ దినము అనగా 07-04-2023 వ తేదీన మధ్యాహ్నం 12. 30 గంటలకు బుళాపురం మిట్ట వద్ద ఉన్న మూతపడిన A -1 restaurant వద్ద వుండగా పై ఇద్దరినీ అరెస్టు చేసి, వారి వద్ద ఉన్న 20 బాక్స్ ల సిల్వర్ మాక్స్ బ్లెడ్స్ కాటూన్స్ ను వాటి విలువ సుమారు 2,96,000/ ను స్వాదినం చేసుకోవడం అయినది. కేసు వివరాలు 1.Cr.No 21/2023 U/sec 457, 380 IPC of Peapully PS2. Cr.No 32/2023 U/sec 457, 380 IPC of Peapully PS
ముద్దాయిలు: సునిల్ బెజవత్ @ సునిల్ కుమార్, వయసు 26 సంIIలు, తండ్రి రాధేశ్యామ్ బెజవత్, అభైపూర్ గ్రామం, sonkatch మండలం, దేవాస్ జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రం.2. జోటువ రమేశ్, వయసు 39 సంIIలు, తండ్రి జే ఖానాజీ, చౌడియా గ్రామం, కమలాపూర్ పోస్ట్ దేవాస్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం.
కేసు వివరాలు: 1. 21. 02. 2023 నాడు హైదరాబాద్ నుండి బెంగళూరు కు వెళ్తున్న కంటైనర్ లో వెనుక భాగం నందు సీల్ కట్ చేసి అందులో 17 మల్బారో సిగరెట్ బాక్స్ లను దొంగతనం.2. 16. 03. 2023 కూడా హైదరాబాద్ నుండి బెంగళూరు కు వెళ్తున్న కంటైనర్ లో వెనుక భాగం నందు సీల్ కట్ చేసి అందులో ఉన్న 65 సిల్వర్ మాక్స్ కంపెనీ కి చెందిన షేవింగ్ బ్లెడ్ బాక్స్ లను దొంగతనం
ప్యాపిలి పోలీస్ స్టేషన్ కు సంబందించిన రెండు హైవే దొంగతనం కేసులలో ముద్దాయిలు అయినా సునీల్ కుమార్ మరియు రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు నేషనల్ హై వే 44 పై గల ఓబుళాపురం మిట్ట నుండి ప్యాపిలి మధ్యలో రోడ్ ను ఆసరాగ తీసుకోని కంటైనర్ లలో వేళ్ళు సరుకులను తన ఇతర స్నేహితులు సహాయంతో ఇనుప కట్టర్ తో కంటైనర్ సీల్ ను కట్ చేసి లోపలికీ ప్రవేశించి అందులో ఉన్న అట్ట బాక్స్ లను క్రిందకు పడవేయగా వాటిని మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ పట్టణం లో ఉండే రషీద్ అనే వ్యక్తికి అమ్మేవారు ఆలా 21. 02. 2023 నాడు హైదరాబాద్ నుండి బెంగళూరు కు వెళ్తున్న కంటైనర్ లో వెనుక భాగం నందు సీల్ కట్ చేసి అందులో 17 మల్బారో సిగరెట్ బాక్స్ లను దొంగతనం చేసి వాటిని ఇండోర్ కి తీసుకోని వాటిని అమ్మే 1 లక్ష రూపాయలు సొమ్ము చేసుకున్నారు అదే విధంగా తేది 16. 03. 2023 కూడా హైదరాబాద్ నుండి బెంగళూరు కు వెళ్తున్న కంటైనర్ లో వెనుక భాగం నందు సీల్ కట్ చేసి అందులో ఉన్న 65 సిల్వర్ మాక్స్ కంపెనీ కి చెందిన షేవింగ్ బ్లెడ్స్ లను దొంగతనం చేసి మల్లి అదే రోజు వేరే కంటైనర్లను దొంగతనం చేయడానికి ప్రయత్నం చేయగా వారి ప్రయత్నం విఫలం అయినది అంతట వారు దొంగతనం చేసిన 65 సిల్వర్ మాక్స్ బ్లేడ్ బాక్స్ లలో దాచిపెట్టిన 20 బాక్స్ లను ఓబుళాపురం మిట్ట వద్ద ఉన్న మూతపడిన A -1 restaurant దగ్గర దాచి పెట్టి తిరిగి ఈ రోజు వాటిని తరలించడానికి ప్రయత్నం చేస్తుండగా వారిని పట్టుకోవడం జరిగింది. ఈ సంచలనమైన కేసు ను డిటెక్ట్ చేయడానికి ప్రత్యెక బృందం CCS CI శ్రీ పి. రామకృష్ణ గారి ఆధ్వర్యంలో 10 రోజులు మధ్య ప్రదేశ్ రాష్ట్రం వివిధ ప్రాంతంలో తిరిగి సమాచారం సేకరించి నంద్యాల జిల్లా ప్యాపిలి పోలీస్ స్టేషన్ లోని 02 కేసులను డిటెక్ట్ చేసి చేసిన నంద్యాల CCS CI శ్రీ పి . రామకృష్ణ గారు, శ్రీనివాసులు SI CCS ప్యాపిలి SI శ్రీ CM రాకేష్ గారు, సిబ్బంది HC ఇబ్రహీం @ మున్నా, PCs హుస్సేన్ బాషా, శివ ప్రసాద్, వెంకటేష్ మరియు టెక్నికల్ సిబ్బంది అయిన మధు, శేకర్ రెడ్డి లను SP గారు నగదు బహుమతి ఇచ్చి అభినధించారు.