PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేర సమీక్షా సమావేశం నిర్వహించిన నంద్యాల జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ రఘువీర్ రెడ్డి IPS గారు నంద్యాల జిల్లాలోని బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో మొదటి సారిగా జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి సబ్ డివిజన్ వారీగా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం నందు జిల్లా ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు వాటి పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.పోలీస్ స్టేషన్ల వారీగా U.I కేసులు తగ్గించుకోవాలన్నారు. నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు.హత్యలు, హత్యాయత్నాలు,క్రైమ్ అగైనెస్ట్ ఉమన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 Cr.P.C, తదితర కేసులను సమీక్ష చేశారు. ఈ మిసింగ్ కేసులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని త్వరితగతిన కనుగొనేలా చేయాలని ఆదేశించారు.అరెస్టులు, చార్జ్ షీట్లు, సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా చూసుకోవాలని వాటికి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నమోదైన కేసులలో సమగ్ర దర్యాప్తు నిర్వహించి నేరస్తులు తప్పించుకునే వీలు లేకుండా న్యాయ స్థానాలలో తగిన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అన్నీ ఆదారాలు సేకరించి చార్జిషీట్ ఢాకాలు చేయాలన్నారు. పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను CCTNS లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని తెలిపారు. ఆయా కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు సూచించారు.హత్య కేసుల, POCSO కేసులు మరియు రేప్ కేసులలో దర్యాప్తు వేగాన్ని పెంచాలని, హత్య మరియు ఇతర కీలకమైన కేసుల్లో శాస్త్రీయ పద్ధతులలో దర్యాప్తు సమగ్రంగా చేపట్టాలని, మహిళల, చిన్నారుల అదృశ్యం కేసులలో ఏ విధమైన అలసత్వం చూపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, తప్పిపోయిన వారిని పట్టుకొనుటలో నిబద్ధత చూపించాలని సూచించారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని దొంగిలించిన సొత్తును రికవరీ చేయాలన్నారు. బీట్లు, పికెట్స్ ఏర్పాటు చేసుకొని అధికారులు తరుచుగా బీట్ చెక్ చేస్తూ సిబ్బందికి సూచనలు ఇవ్వాలన్నారు. దొంగతనాలు, దోపిడీలు, తదితర నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలకు వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.దొంగతనాలను అరికట్టేందుకు హైవే రహదారులపై వాహనాల తనిఖీలు చేస్తూ ప్రత్యేక చొరవ చూపాలని అలాగే లారీ అసోసియేషన్ వారితో మాట్లాడి కంటేనర్ భారీ వాహనాలకు CC కెమరాలు ఎర్ఫటు చేసుకోవాలని వివరించి అవగాహన కల్పించాలని మరియు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని పాపిలాన్ పరికరం ద్వారా వారి వేలి ముద్రలను తనిఖీ చేయాలి.రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వాహన తనిఖీలు చేపట్టి ఎం.వి.చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ, ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోన్ యాప్ ల మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా చైతన్యం చేయాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన మట్కా, పేకాట, అక్రమ మద్యం రవాణాపై ముందస్తు సమాచారం సేకరించి వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి వంటి నిషేధిత మాదకద్రవ్యాలను రవాణా మరియు విక్రయించే వారిపై NDPS కేసులు నమోదు చేయాలన్నారు.గంజాయి రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి NDPS కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించాలి. వీటిని అరికట్టడం వల్ల చిన్న పిల్లలను మరియు యువతను కాపాడుకోగలుగుతాము.అధికారులు ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుని ప్రతి పోలీసు అధికారి బాధ్యతగా వ్యవహరించాలి పూర్తిస్థాయిలో విచారణ దర్యాప్తు చేసి ఖచ్చితమైన ఆధారాలతో కోర్టుకు సమర్పించి బాధితులకు సరైన న్యాయం చేయాలన్నారు.ఈ కార్యాక్రమం నందు జిల్లా ఎస్పీ గారితో పాటు స్పెషల్ బ్రాంచ్ CI దస్తగిరిబాబు గారు,డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో CI జయరాములు గారు, SI లు సూర్యమౌళి గారు,అశోక్ గారు,రమేశ్ బాబు గారు,హరినాథ్ రెడ్డి గారు పాల్గొన్నారు.

About Author