PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నంద్యాల మందు బాబుల నిర‌స‌న

1 min read

నంద్యాల‌ వెబ్​, పల్లెవెలుగు: నంద్యాల లో మందు బాబులు వినూత్నంగా నిర‌స‌న తెలిపారు. త‌మ బాధ‌ల‌ను ఓ చీటిలో రాసి.. బ్యాలెట్ పేప‌ర్ తో పాటు బ్యాలెట్ బాక్సులో వేశారు. నంద్యాల మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఈ విచిత్రం చోటుచేసుకుంది. 29 వార్డు బ్యాలెట్ బాక్స్ లో మందు బాబుల విన్నపం పేరుతో ఓ లెట‌ర్ ద‌ర్శనమిచ్చింది. జ‌గ‌న్ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌.. కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చింది. మ‌ద్యం కూడ చాలా త‌క్కువ క్వాలిటీతో స‌ర‌ఫ‌రా చేస్తున్నారంటూ ఇది వ‌ర‌కే ప‌లువురు మందుబాబులు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలోనే నంద్యాల తాగుబోతుల విన్నపం అంటూ ఓ లేఖ‌ను బ్యాలెట్ బాక్సులో వేశారు. కొత్త మ‌ద్యం బ్రాండ్లయిన సుప్రీం, దారు, హైద‌రాబాద్, జంబో త‌దిత‌ర బ్రాండ్ల స‌ర‌ఫ‌రా నిలిపివేసి.. పాత మ‌ద్యం బ్రాండ్లయిన కింగ్ ఫిష‌ర్, రాయ‌ల్ స్టాగ్, బ్లాక్ డాగ్ ల‌ను పంపిణీ చేయాల‌ని కోరారు. త‌మ డిమాండ్ నెర‌వేర‌క‌పోతే ఇదే చివ‌రి ఓట‌వుతుంద‌ని హెచ్చరించారు కూడ‌.

About Author