బండి ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేసిన నంద్యాల సబ్ కలెక్టర్
1 min read
పల్లెవెలుగు వెబ్, బండి ఆత్మకూరు: బండి ఆత్మకూరు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులు పరిశీలించారు. భూముల స్వచ్చీకరణ, భూముల రీ సర్వే, కోవిడ్ నివారణ వ్యాక్సిన్, యం డి యు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ మరియు స్పందనకు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిస్తున్నారా ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా తదితర కార్యక్రమాలు ఎలా జరుగుతున్నా యని తహసీల్దార్ హరిత ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు.
తనిఖీ సమయంలో వీఆర్వోలు, సర్వేయర్లు, పంచాయతీ సెక్రటరిలు ఉన్నారు.