PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నంద్యాల‌.. అనుమానాస్ప‌ద స్థితిలో వ‌రుడు మృతి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : న‌ంద్యాల జిల్లాలో విషాధం చోటుచేసుకుంది. వెలుగోడు మండలం బోయారేవుల వద్ద నవవరుడు శివకుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అర్థరాత్రి వరకు డీజే డాన్స్‌లో పాల్గొన్న శివకుమార్ తెల్లవారేసరికి మృతి చెంది కనిపించాడు. నవ వరుడు ఎలా మృతిచెందాడు అనేది మిస్టరీగా మారింది. శివకుమార్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. శివకుమార్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

                             

About Author