PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోల్ కతా సెట్ లో నాని యాక్షన్

1 min read

పల్లెవెలుగు వెబ్​: బ్యాక్ టు బ్యాక్ టు ప్రాజెక్ట్స్ తో నానీ బిజీ అయిపోయాడు. నాని కమిటైన వరుస సినిమాల్లో ‘టక్ జగదీష్’ రిలీజ్ సిద్ధమయ్యింది. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ షూట్‌లో పాల్గొంటున్నాడు. లాక్ డౌన్ తో బ్రేక్ పడిన ఈ మూవీ షూటింగ్స్ ని తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు దర్శకనిర్మాతలు. నిన్న ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ఫైనల్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సినిమా కోసం గతంలో హైదరాబాద్ లో పది ఎకరాల స్థలంలో కోల్ కతా సెట్ వేశారు ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా. రీసెంట్ గా హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు సెట్ దెబ్బతినడంతో దాన్ని రీక్రియేట్ చేసి ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నాని కొత్త లుక్ ఒకటి విడుదల చేశారు. నాని వెనక్కి తిరిగి నిల్చొన్నాడు. బ్యాగ్రౌండ్‌లో త్రిశూలాలు ఉన్నాయి.. దాంతో ఇక్కడో యాక్షన్ పార్ట్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. నానితో సహా లీడ్ యాక్టర్స్ పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వింటేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటీఫుల్‌ హీరోయిన్స్ నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా విలన్ గా నటిస్తున్నాడు. వెంకట్ ఎస్.బోయనపల్లి నిర్మాత. మిక్కీజె.మేయర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో ‘అంటే సుందరానికీ’ సినిమాలో కూడా నటిస్తున్నాడు నాని.

About Author