ఆర్జీవి ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా టికెట్ ధరల తగ్గింపు పై పది ప్రశ్నలు సంధించారు. దీనికి సమాధానం చెప్పాలని మంత్రి పేర్నినానిని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్నినాని రామ్ గోపాల్ వర్మకు కౌంటర్ ఇచ్చారు.`
- రూ.100 టికెట్‌ను రూ.1000, రూ.2000కు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్, సప్లయ్ అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?
- గత 66 సంవత్సరాలుగా చట్టాలకు లోబడే ప్రభుత్వాలు ధర నిర్ణయిస్తున్నాయి. కానీ, ఇప్పుడు సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి ఉండకూడదనే ప్రభుత్వం సినిమా టికెట్ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది.
- నిత్యావసరాల ధరల్నే ప్రభుత్వం నియంత్రించవచ్చని.. సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని మీరు ప్రశ్నించారు. సినిమా థియేటర్లు ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు.
- బలవంతంగా ధరలు తగ్గిస్తే ప్రోత్సాహం తగ్గుతుందన్నారు. ప్రోత్సాహం తగ్గేదెవరికి.. కొనేవారికా? లేక అమ్మేవారికా? నిర్మాతల శ్రేయస్సు తప్ప ప్రేక్షకుల గురించి ఆలోచించరా?.
- వైద్యం, విద్య మాదిరిగా రాయితీని ప్రభుత్వం భరించాలన్నారు. సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగా గానీ మేం భావించడం లేదు.
- హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. రెమ్యూనరేషన్, సినిమాకు పెట్టిన ఖర్చు చూసి ఏ ప్రభుత్వమూ టికెట్ ధర నిర్ణయించదు. మేము చేసింది టికెట్ ధరల నియంత్రణే తప్ప.. సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మూటికీ కాదు అంటూ ఆర్జీవి ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని సమాధానం ఇచ్చారు. మరి ఆర్జీవి ఈ సమాధానాలతో సంతృప్తి చెందుతారో.. లేదో చూడాలి.