రామ్ గోపాల్ వర్మను చర్చలకు పిలిచిన మంత్రి పేర్ని నాని !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు పై వివాదం నడుస్తున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రభుత్వం పై పలు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని నుంచి రామ్ గోపాల్ వర్మకు పిలుపు వచ్చింది. ఈ నెల 10న మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావల్సిందిగా వర్మకు ఆహ్వానం అందిందని వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘మంత్రి పేర్ని నాని నుంచి పిలుపొచ్చిం ది. సినిమా టికెట్ల వ్యవహారంలో అభిప్రాయాలు పంచుకోవడానికి ఆహ్వానం అందింది. ఈ అవకాశం కల్పించినందుకు మంత్రిగారికి కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.