PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సినిమా టికెట్ల అంశం పై నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సినిమా టికెట్ల త‌గ్గింపు పై ప్రముఖ హీరో నాని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ప్ర‌భుత్వ తీరు పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. టికెట్లు త‌గ్గించి ప్రేక్ష‌కుల్ని అవ‌మానించార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. శ్యామ‌సింగ‌రాయ్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు తగ్గించింది. ఏది ఏమైనా ఆ నిర్ణయం సరైనది కాదు. టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉంది. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అయితే నేను ఇప్పుడు ఏదీ మాట్లాడినా వివాదమే అవుతుంది’’ అని నాని వ్యాఖ్యానించారు.

                           !

About Author