అసెంబ్లీ ఘటనపై.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు !
1 min read
పల్లెవెలుగు వెబ్ : ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన పరిణామాలపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. తనకు జరిగిన అవమానం మరెవరికి జరగకూడదని ఆశిస్తున్నానని ఆమె తెలిపారు. తనకు జరిగిన అవమానాన్ని తన తల్లికి, తోబుట్టువుకి, భార్యకి జరిగినట్టు భావించి.. తనకు అండగా నిలబడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. చిన్నతనం నుంచి తమను అమ్మానాన్న విలువలతో పెంచారని అన్నారు. నేటికీ ఆ విలువల్ని తాము పాటిస్తున్నామని తెలిపారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని చెప్పారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
ReplyForward |