పరువు నష్టం దావా వేయనున్న నారా బ్రాహ్మణి
1 min readపల్లెవెలుగువెబ్ : టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, వైసీపీలోని కొందరు ఫేక్ పోస్టులతో ఈ ప్రచారం చేస్తున్నారని, వారిపై పరువు నష్టం దావా వేసేందుకు రంగం సిద్ధమవుతోందని ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ దావాలను స్వయంగా నారా బ్రహ్మణినే దాఖలు చేయనున్నారని కూడా ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది. నారా బ్రహ్మణి నిరుపేద అని, అటువంటి మహిళ రూ.1,600 కోట్లతో జయలలితకు చెందిన ఫామ్ హౌజ్ ను కొన్నారని, అంతటి డబ్బు ఆమెకు ఎక్కడిదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ పోస్టును టీడీపీ ప్రస్తావించింది.