యువగళం ద్వారా నారా లోకేష్ ప్రజల్లో ధైర్యం నింపారు…
1 min read
కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ రాష్ట్రంలోని ప్రజల్లో ధైర్యం నింపారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. శనివారం నగరంలోని మౌర్య ఇన్‌లో ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేసి యువగళం పాదయాత్ర విజయవంతంపై మాట్లాడారు. 226 రోజుల్లో 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం మామూలు విషయం కాదన్నారు. ఈ పాదయాత్రలో ఆయన రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూశారన్నారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదివిన విద్యావంతుడు లోకేష్.. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉండటం చాలా సంతోషకరమన్నారు. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని టి.జి భరత్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి పాలన అందిస్తామన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి తీసుకువస్తామని ఆయన చెప్పారు.