NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నారా లోకేష్ హింసిస్తున్నాడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తన ఐటీ టీమ్‌ ద్వారా సోషల్‌ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టించి హింసిస్తున్నాడని టీడీపీ మాజీ మహిళా నేత పాలేటి కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్‌తో పాటు ఆయన ఐటీ టీమ్‌పై ఆమె మంగళగిరి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్‌ ఒక పథకం ప్రకారం మహిళలను కించపరుస్తూ పోస్టులు పెట్టిస్తున్నారని విమర్శించారు. తన పేరుతో ట్విట్టర్‌ పోస్టును మార్ఫింగ్‌ చేసి.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. మహిళలు టీడీపీలో ఉన్నంతకాలం లోకేష్‌కు దేవతల్లా కనిపిస్తారని.. అక్కడి నుంచి బయటకు రాగానే బజారు మనుషుల్లా కనిపిస్తారన్నారు.

                                   

About Author