PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువ‌తీ,యువ‌కుల‌తో నారా లోకేష్ పొలిటిక‌ల్ టీమ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాజకీయ నేత‌ల‌ను తీర్చిదిద్దే స‌రికొత్త కార్య‌క్ర‌మానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. పొలిటిక‌ల్ ఇంట‌ర్న్‌షీప్ పేరిట‌ రాజ‌కీయాల్లో నిష్ణాతుల‌ను రూపొందించే ఈ కార్య‌క్ర‌మంలో దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు చెందిన యువ‌తీ యువ‌కులు త‌మ శిక్ష‌ణ‌ను పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా తొలి బ్యాచ్‌కు చెందిన యువ‌తుల‌తో టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ గురువారం భేటీ అయ్యారు. వారితో తాను జ‌రిపిన భేటీకి సంబంధించిన ఫొటోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా వారితో జ‌రిపిన చ‌ర్చ‌లు త‌న‌ను అమితానందానికి గురి చేశాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

                                 

About Author