కడప సెంట్రల్ జైలుకు నారా లోకేష్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కడపకు చేరుకున్నారు. లోకేశ్ వస్తుండటంతో కడప విమానాశ్రయం వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన కడప సెంట్రల్ జైలుకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. జైల్లో ఉన్న టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డిని ఆయన పరామర్శించనున్నారు. ప్రవీణ్ రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు నారా లోకేశ్ తో పాటు మరో 17 మంది నేతలకు అధికారులు అనుమతిని ఇచ్చారు. మరోవైపు, నారా లోకేశ్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.