NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆస్తుల్లో నారా లోకేష్ టాప్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శాసన మండలి సభ్యుల్లో 75 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), ఏపీ ఎలక్షన్‌ వాచ్‌ తాజా అధ్యయనం పేర్కొంది. ఎప్పటికప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు.. అభ్యర్థులు అందించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. మొత్తం 58 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్సీలలో 48 మంది వివరాలను విశ్లేషించారు. వీరిలో 75 శాతం మంది అంటే 36 మంది కోటీశ్వరులేనని స్పష్టమైంది. రూ.369 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ అత్యంత ధనవంతుడు అని ఏడీఆర్‌ రిపోర్టు పేర్కొంది. రెండో స్థానంలో రూ.101 కోట్లతో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఉండగా, మూడో స్థానంలో రూ.36 కోట్లతో ఎమ్మెల్సీ టి.మాధవరావు ఉన్నారు.

                                       

About Author