గోనెగండ్ల లో నారా లోకేష్ యువ గళం పాదయాత్ర
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్లలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర కు ప్రజల నుంచి అశేష స్పందన లభించింది. పార్టీ శ్రేణులలో ఉత్సాహం ఉరకలేస్తుంది.ఇప్పటికే తన పర్యటన నారా లోకేష్ ప్రధానంగా యువతనే ఆకట్టుకునే విధంగా పలు రకాలుగా ప్రసంగాలుచేస్తూ ఉండడంతోపాటు ఉపాధి కల్పనకు పెద్ద పూట వేస్తామని హామీ ఇస్తుండడంతో యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మహిళలు ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో యువ గళం పాదయాత్రలో పాల్గొన్నారు. ముందుగా గోనెగండ్ల మండలం పరిధిలోకి ప్రవేశించగానే తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.గోనెగండ్లలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా గోనెగండ్లకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు బేతాళ బడేసా నూర్ అహ్మద్ లు మైనార్టీల విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అలాగే మైనార్టీలకు షాదీ ముబారక్ ద్వారా లబ్ధి చేకూరేల చూడాలని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు వినతి పత్రం అందజేశారు. అలాగే రాయలసీమలో కరువు కాటకాలు, వలసలు నివారించుట కై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్ఎన్ బాబు వలి నారా లోకేష్ కి వినతి పత్రం అందజేశారు. అలాగే ఎస్సీ కాలనీ వాసులు అడ్వకేట్ వెంకటేష్, మునుస్వామి నాగరాజు, శరత్ కుమార్ లు దళితులకు రద్దు చేయబడిన స్కీములను కొనసాగించాలని, స్థానిక సంస్థల పరిష్కారానికై చర్యలు చేపట్టాలని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యావని, దళితులపై దాడులు దౌర్జన్యాలు ఆపాలని, మీ ప్రభుత్వం వచ్చాక దళిత సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి దళితుల అభివృద్ధికి కృషి చేస్తారని వినతిపత్రం అందజేశారు. యువగలం పాదయాత్రలో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజలకు మహిళలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఈ యువ గళం పాదయాత్ర ఎమ్మిగనూరు కర్నూలు ప్రధాన రోడ్డు వెంబడి కొనసాగుతుండగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమ్మిగనూరు రూరల్ సీఐ మోహన్ రెడ్డి, గోనెగండ్ల ఎస్సై తిమ్మారెడ్డి ల ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.