నారాలోకేష్ అక్రమ అరెస్టును ఖండిస్తూ .. నిరసన, ప్రదర్శన
1 min readపల్లెవెలుగు వెబ్, చెన్నూరు: గుంటూరు జిల్లా కమలాపురంలో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ. దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారాలోకేష్‌ను అరెస్టు చేయడాన్ని నిరసనగా.. సాయినాథ్ శర్మ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అమర్నాథ్ తదితరుల నేతృత్వంలో చెన్నూరు మండలంలోని కమలాపురం, పెద్దచెప్పలి, కొండాయపల్లి , చదిపిరాళ్ల తదితర గ్రామాల్లోని దళితవాడల్లో ప్రజా చైతన్య నిరసన, ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పౌరుల హక్కులను పోలీసులను అడ్డు పెట్టుకొని కాలరాస్తోందన్నారు. హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ వెళ్లడం రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో , పోలీసుల దృష్టిలో ఏవిధంగా తప్పుగా కనిపిస్తుందో ప్రజలకు తెలియజేయాలన్నారు. రాష్ట్రంలో వైయస్సార్ మృతి చెందినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టి ఇంటింటికి వెళ్లి పరామర్శించిన విషయం ఆయనకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు రాయచోటి సుధాకర్, నాగరాజాచారి, మహమ్మద్ రఫీ, ప్రభాకర్ రెడ్డి, నామాల రాజా, ఇమామ్ హుస్సేన్, చెన్నూరు మండల తెలుగుదేశం బీసీ నాయకుడు పెద్ద బుద్ధి వెంకట శివ మల్లేసు రమణ అనీఫ్ పాల్గొన్నారు. అదేవిధంగా చదివి రాళ్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడు పురుషోత్తం ఆధ్వర్యంలో కొండాయపల్లె లో సర్పంచ్ పాలేటి భవాని, కమలాపురం రామ్ నగర్ లో స్థానిక తెలుగుదేశం నాయకుడు నాగరాజు, విక్రమ్ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.