PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారాలోకేష్​ను.. వెంటనే విడుదల చేయాలి : టీఎన్ఎస్ఎఫ్

1 min read

పల్లెవెలుగు వెబ్​: రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అక్రమ అరెస్టు చేయడం వైసీపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని, వెంటనే పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు టిఎన్ఎస్ఎఫ్ కర్నూల్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ బొగ్గుల ప్రవీణ్. పలాసలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్​ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు.  వెంటనే నారా లోకేష్​ను విడుదల చేయాలని, లేదంటే టీఎన్​ఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా బొగ్గుల ప్రవీణ్​ హెచ్చరించారు.

About Author